Retirement Benefits | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు చకోర పక్షు ల్లా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ విరమణ పొంది ఏడాది దాటినా బెనిఫిట్స్ బిల్లులు క్లి యర్ కావడం లేదు. పెండింగ్ మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, ఇంక్రిమెంట్స్ బిల్స్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), టీజీజీఎల్ఐ, హెచ్‌బీఏ.. ఇలా ఉద్యోగులకు సంబంధించిన అనే క బిల్లులు రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయంలోని ఆర్థికశాఖ కా ర్యాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులు కాళ్లరిగేలా తిరిగినా ప్రభుత్వం కనికరించడం లేదు.
పైగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రూపా యి రూపాయి పొదుపు చేసి దాచుకొన్న సొమ్మును ఇచ్చేందుకు కూడా కమీషన్లు అడుగుతున్నారు. ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్‌కు ఆర్థికశాఖ సిబ్బంది 15% కమీషన్ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. 10% సిబ్బందికి ఇచ్చి మిగతా మొత్తం బ్రోకర్లు కాజేస్తున్నట్టు ఉద్యోగులు వాపోతున్నారు. ఇలా ఒక్కో ఉద్యోగి రూ.3-4 లక్షల వరకు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రూ.10-15 వేలు చెల్లించి హైకోర్టును ఆశ్రయిస్తున్నా రు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగు లు కోర్టును ఆశ్రయించి బిల్లులు పొందారు.
ఒక్కొక్కరికి రూ.35-75 లక్షలు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 3.59 లక్షల మంది ఉన్నారు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు ను 59 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచింది. ఆ గడువు నిరుడు మార్చితో ముగియడంతో 2024 డిసెంబర్ 31 వరకు 7,995 మంది రిటైర్ అయ్యారు. 2025లో 9,630 మంది ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్నది. ఉద్యోగ విరమణ పొందిన ఒక్కో ఉద్యోగికి రూ.35 లక్షల నుంచి 75 లక్షల వరకు రావాల్సి ఉన్న ది. ఇలా విశ్రాంత ఉద్యోగులకు రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నది.
రిటైర్మెంట్ రోజునే హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్‌ను ఏడాది దాటినా సర్కారు అందించడం లేదు. 2,200 కోట్ల వరకు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 15 నెలలు గడుస్తున్నా బిల్లులు క్లియర్ కాకపోవడంతో రేవంత్ సర్కారు నిర్లక్ష్యంపై కొంద రు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆరు వారాల్లోగా వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేస్తున్నది.