నల్లగొండ, మార్చి 5: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని జ్యోతి దవాఖాన సమీపంలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి తుది తీర్పునకు రంగం సిద్ధమైంది. ఈ కేసుపై ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాలు, ఆధారాల సమర్పణ పూర్తి కావడంతో ఈ నెల 10న తుది తీర్పు వెలువరించేందుకు రెండో అదనపు సెషన్స్ కోర్టు, ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి సిద్ధమయ్యారు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరుగగా ఆయన తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు 302, 120 బీ ఎస్సీ, ఎస్టీ సెక్షన్ష కింద కేసు 8 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఏ1గా మారుతీరావు, ఏ2గా సభాష్శర్మ, ఏ3గా అస్గర్ అలీ, ఏ4గా అబ్దుల్ బారీ, ఏ5గా కరీం, ఏ6గా శ్రవణ్, ఏ7గా శివ, ఏ8గా నదీమ్ ఉన్నారు. ఇందులో ఏ1 మారుతీరావు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నారు.