హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దవాఖాన విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించే భవన నమూనా చిత్రమిది. ఈ భవన నిర్మాణానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఎనిమిది అంతస్థులు, రెండు వేల పడకలతో ఈ భవనం నిర్మితం కానున్నది.
ఈ భవన నిర్మాణం పూర్తయితే నిమ్స్‌లో పడకల సంఖ్య 3,500కు చేరుతుంది. ఇదే దవాఖానలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు పూర్తయి 3,700 పడకలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి.