కొండాపూర్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): కులం పేరుతో దూషిస్తూ, ప్రజల్లో వర్గవిభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారని సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు హైటెక్ సిటీలోని మైహోమ్భుజలో నివాసం ఉంటున్న పోసానిని బుధవారం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆంధ్రాకు తరలించారు.