Actor Navdeep | గతంలో డ్రగ్స్ తీసుకొనేవాడిని: నటుడు నవదీప్
గతంలో డ్రగ్స్ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్ చెప్పినట్టు తెలిసింది. ఎలాంటి వైద్యపరీక్షలకు అయినా తాను సిద్ధమని అన్నట్టు సమాచారం.
- టీన్యాబ్ పోలీసుల విచారణలో సినీ నటుడు నవదీప్ వెల్లడి
- ఫోన్ డాటా తొలగించినట్టు గుర్తింపు
- సెల్ సీజ్, డాటా రిట్రీవ్‌కు సన్నాహాలు
- మరోసారి రావాలని ఆదేశాలు
Actor Navdeep | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): గతంలో డ్రగ్స్ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్ చెప్పినట్టు తెలిసింది. ఎలాంటి వైద్యపరీక్షలకు అయినా తాను సిద్ధమని అన్నట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న నవదీప్ యాంటీ నారొటిక్స్ బ్యూరో (టీన్యాబ్) విచారణకు హాజరయ్యాడు. శనివారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని హెచ్ న్యూ ఆఫీస్‌కు చేరుకున్న నవదీప్‌ను ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృం దం సాయంత్రం 5 గంటల వరకు విచారించిం ది. గత నెల 31న టీన్యాబ్ పోలీసులు మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దాడులు జరిపి, రామ్‌చంద్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడి కాల్‌డాటా ఆధారంగా నవదీప్‌ను టీన్యాబ్ పోలీసులు విచారించారు.
డాటా తొలగించినట్టు గుర్తింపు.. ఫోన్ సీజ్
నవదీప్ తన సెల్‌ఫోన్‌ను తీసుకురాకపోవడంతో టీన్యాబ్ అధికారులు ఫోన్‌ను తెప్పించారు. మొబైల్‌ను ఫార్మాట్ చేసి సోషల్ మీడియా, గ్యాలరీసహా డాటా మొత్తం డిలీట్ చేసినట్టు గుర్తించారు. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి, డాటా రిట్రీవ్ చేయించనున్నారు. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని నవదీప్‌ను ఆదేశించారు. ‘డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ అనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’లోని డ్రగ్స్ సప్లయర్లు, కస్టమర్లుగా ఉన్న 81 మందితో నవదీప్ కాంటాక్ట్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇందులో 45 మంది అనుమానితులను పరిశీలించారు. వారికి నవదీప్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. పథకం ప్రకారమే నవదీప్ తన ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్టు అనుమానిస్తున్నారు. నెల రోజుల క్రితం రిపేర్‌కు ఇచ్చినట్టు చెప్పడంతో సర్వీస్ సెంటర్వారి నుంచి కూడా టీన్యాబ్ సమాచారం సేకరించారు. ఫోన్ డాటా రిట్రీవ్ తరువాత నవదీప్‌ను మరోసారి టీన్యాబ్ అధికారులు విచారించనున్నట్టు తెలిసింది.
నవదీప్ సహకరించాడు..
డ్రగ్స్ కేసు విచారణలో నవదీప్ పూర్తిగా సహకరించినట్టు టీన్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి చెప్పారు. వ్యక్తిగత వివరాలు, సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ, వ్యాపారాలు, బ్యాంక్ అకౌంట్స్ సమాచారం అందించాడని తెలిపారు. ఈ కేసులో పట్టుబడ్డ డ్రగ్ వినియోగదారుడు కొల్లి రామ్‌చంద్‌తో 15 ఏండ్లుగా పరిచయం ఉన్నట్టు నవదీప్ అంగీకరించినట్టు చెప్పారు. అమెరికాకు వెళ్లిన సమయంలో అకడ లభించే గమ్మీస్ తీసుకునేవాడినని నవదీప్ తెలిపాడని, ఇందులో స్థానిక చట్టాలకు అనుగుణంగా డ్రగ్స్ మోతాదు ఉంటుందని తెలిపారు. గతంలో రామ్‌చంద్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లో బీపీఎం పబ్ నిర్వహించినట్టు, ఏడాది మాత్రమే ఆ పబ్‌ను నిర్వహించి తర్వాత మూసివేసినట్టు నవదీప్ విచారణలో వెల్లడించినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

