Actor Abhishek | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు అభిషేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతున్న అభిషేక్.. గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడనే సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేసి గురువారం హైదరాబాద్‌కు తరలించారు.