హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘ఆదివాసీల హక్కుల పోరాటయోధుడు కుమ్రంభీం పోరాట స్ఫూర్తితో నాడు ఉద్యమనేతగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు.. నేడు అదే కేసీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ అరాచక పాలనపై పోరాటానికి పురంకితం అవుతాం’ అని శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో బుధవారం కుమ్రం భీం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడారు.
ఆనాటి రాచరిక వ్యవస్థను ఎదిరించి ఆదివాసీ హక్కుల కోసం కుమ్రంభీం వీరోచితంగా పోరాడాని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, రావు ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్‌కుమార్, నోముల భగత్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, పార్టీ కార్యదర్శి ఒంటెద్దు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, నాయకులు రంగినేని అభిలాశ్, సుమిత్రా ఆనంద్, గాంధీనాయక్, వాడపల్లి మాధవ్, ఫయీమ్ తదితరులు పాల్గొన్నారు.