హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో ఎమ్మెల్సీ రగడ మొదలైంది. టికెట్ కోసం అసలు కాంగ్రె స్ వర్సెస్ వలస కాంగ్రెస్ మధ్య పోరు మొదలైనట్టు తెలిసింది. సీనియర్ నేతలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగాలు చేసిన వారంతా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతుండగా.. సీఎం మాత్రం మరో ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఆశావహు లు సీఎంకు చెక్ పెట్టి.. ఢిల్లీ స్థాయిలో లా బీయింగ్ మొదలు పెట్టినట్టు తెలిసింది.
రెండు పోగా.. కాంగ్రెస్కు రెండు సీట్లే !
రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకా రం నాలుగు సీట్లు కాంగ్రెస్కు, ఒక సీటు బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉంది. అయి తే కాంగ్రెస్ ప్రభుత్వానికి సీపీఐ మిత్రపక్షంగా ఉండగా ఎంఐఎం కూడా పరోక్షంగా సహకరిస్తున్నది. సీపీఐకి ఒక సీటు ఇస్తే కాంగ్రెస్కు మిగిలేది మూడు సీట్లే. ఎంఐఎం కూడా పట్టుపడితే ఒక సీటు ఇవ్వాల్సి వస్తుంది. ఇదే జరిగితే కాంగ్రెస్కు మిగిలేది రెండు సీట్లు మాత్రమే. ఆ రెండు సీట్లకు 25 నుంచి 30 మంది వరకు పోటీ పడుతున్నట్టు సమాచారం.
ఖర్చు లేదు.. మంత్రికీ అవకాశం
ఈ ఎన్నికల కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. పార్టీని నమ్ముకుంటే సరిపోతుంది. అందుకే ఈ కోటాలో ఎమ్మెల్సీ కావడానికి నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయితే మంత్రి పదవిని ఆశించే అవకాశం ఉంటుందని పలువురు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్కు ఎమ్మెల్యే లేకపోవడంతో ఎమ్మెల్సీకే మంత్రి పదవి దక్కుతుంది. కాబట్టి హైదరాబాద్ నేతలు సీటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలిసింది.