హైదరాబాద్, మే 14(నమస్తే తెలంగాణ): కాళేశ్వరంలో నేటినుంచి పన్నెండురోజులపాటు జరగనున్న సరస్వతీ పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం పుష్కరాలను ప్రారంభించనున్నారు. పుషరాల్లో ప్రతిరోజూ సుమారు 50వేలమంది పుషర స్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుషరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.
భక్తులకు లభించే వివిధ సేవలపై ఇప్పటికే కాళేశ్వరం యాప్, వెబ్ పోర్టల్‌ను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఏర్పాట్లలో భాగంగా నూతన ఘాట్ నిర్మాణం, స్నానాల కోసం షవర్లు, చలువ పందిళ్లు, లైటింగ్, తాగునీటి సౌకర్యం, అదనపు కౌంటర్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, పిండ ప్రదాన మండపం, కేశఖండన మండపం, శాశ్వత మరుగుదొడ్లు, స్నానాల గదులు, పుషర ఘాట్‌పై సరస్వతీ అమ్మవారి రాతి విగ్రహం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.