హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రైతుల బయోమెట్రిక్ తీసుకున్నాకే ఎరువులను విక్రయించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్) పేపర్ ఇచ్చాకే ఎరువులు పంపిణీ చేయాలని ఆదేశించింది. పీవోఎస్ మిషన్‌లో చూపే స్టాక్‌కు ఎరువుల గోడౌన్లో ఉన్న స్టాక్ మధ్య వ్యత్యాసం లేకుండా చూసుకోవాలని కోరింది. సబ్సిడీ లేని ఎరువులు, సేంద్రియ ఎరువులు, నేల సారవంతం చేసే పదార్థాలను సబ్సిడీ ఎరువులతో కలపొద్దని సూచించింది. లైసెన్సు మంజూరైన జిల్లాల్లోనే ఎరువుల గోదాములు ఉండాలని ఆదేశించింది. రైతులపై కూలీల వేతన భారం మోపవద్దని స్పష్టంచేసింది. ఎరువులను అధిక ధరలకు విక్రయం, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం వంటివి చేయొద్దని హెచ్చరించింది.