Jalpalli | బడంగ్పేట్, జనవరి 30: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 177లో ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేయాలని కలెక్టర్, ఆర్డీవో ఆదేశించారు. ‘బుల్డోజర్లతో తవ్వి.. గుట్టకు గురి’ అనే కథనం ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం కథనం ప్రచురితం కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి భూమిని పరిశీలించారు. ఆర్ఐ జమీల్ పర్యవేక్షణలో ఫెన్సింగ్ పనులు చేపట్టారు. ఇక్కడ మట్టిని తొలగిస్తు న్న వారిపై ఇప్పటికే పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆర్ఐ తెలిపారు. అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉన్న విషయాన్ని తెలుసుకొని గుట్టను తొలగిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఇకపై రాత్రింబవళ్లు పోలీసుల సహకారంతో నిఘా పెట్టనున్నట్టు తెలిపారు.