ఖైరతాబాద్, సెప్టెంబర్ 19: ప్రజాభవన్ వద్ద ఓ మహిళా రైతు ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన మోక్ష మేరి (63)కు మూడు ఎకరాల 18 గుంటల వ్యవసాయ భూమి ఉంది. స్థానికంగా ఆమె బంధువులు భూ మిని ఆక్రమించుకున్నారని మేరి చెప్తున్నది.
గ్రామంలో ఎవరూ న్యా యం చేయడంలేదని, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తూ మనస్తాపానికి గురైంది. శుక్రవారం భర్త లాజర్ (66), కొడుకులు ప్రసాద్‌రాజ్, దిలీప్‌తో కలిసి ప్రజాభవన్ వద్దకు వచ్చింది. మీడియా పాయింట్ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.