రామంతాపూర్, డిసెంబర్ 29 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రవిపహార్ తండాకు చెందిన ప్రమీల (32) నాచారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నది. ఉప్పల్ పద్మావతి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రమీల కుటుంబ సమస్యలతో మూడు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది.
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ నిధుల డ్రాకు సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఉమ్మడి సంతకం చేయడం తప్పనిసరి అని పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధిశాఖ డైరెక్టర్ డాక్టర్ జీ సృజన స్పష్టంచేశారు. ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సోమవారం అబిడ్స్‌లోని రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్‌కు లేఖ రాశారు.
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సావిత్రీబాయి ఫూలే 195వ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 3న పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఘనంగా ఆమె జయంతిని నిర్వహించాలని ఆదేశించింది.