Entrance Exams Fees | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఉన్నత చదువుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల ప్రక్రియలో బీసీ విద్యార్థులకు నిరాశే మిగులుతున్నది. రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఫీజుల్లో బీసీ విద్యార్థులకు రాయితీ కరువైంది. ఎప్సెట్, ఐసెట్, ఎడ్సెట్ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం రాయితీని అమలు చేయటం లేదు. దీంతో బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు జనరల్ క్యాటగిరి విద్యార్థులతో సమానంగా ఫీజులు చెల్లించాల్సి వస్తున్నది. మరోవైపు జాతీయంగా నిర్వహించే జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల్లో ఓబీసీ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పిస్తున్నారు. జేఈఈలో జనరల్ విద్యార్థులకు ఫీజు 1000 రూపాయలు ఉంటే, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి రూ. 900 వసూలు చేస్తున్నారు.
నీట్ (యూజీ) లో జనరల్ విద్యార్థులకు 1700 రూపా యల ఫీజు ఉండగా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 1,600 రూపా యలు తీసుకుంటున్నారు. జాతీయ స్థాయి పరీక్షల్లో రాయితీ కల్పిస్తుండగా, రాష్ట్రంలో మాత్రం రాయితీలు ఇవ్వకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ నెలలోనే వివిధ పోటీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానుండటంతోపాటు వాటికి దరఖాస్తుల స్వీకరణ సైతం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో బీసీ విద్యార్థులకు దరఖాస్తుల్లో ఫీజు రాయితీ కల్పించాలని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రవేశ పరీక్షల్లో ఫీజులిలా..
ఎప్సెట్
ఈసెట్
ఐసెట్
లాసెట్
పీజీ లాసెట్