హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, లేకుంటే 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లను, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల75వేలమంది విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారని వాపోయారు. కాంగ్రెస్ వచ్చాక విద్యావ్యవస్థ మొత్తం గాడి తప్పిందని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే 10న కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.