హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే మణికంఠరెడ్డి, పీ లక్ష్మణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీట్లను బ్లాక్లో పెడుతూ మెరిట్ విద్యార్థులకు ఇవ్వకుండా లక్షల ఫీజులు కట్టేవారికే ఇస్తున్నట్టు తెలిపారు. కొన్ని కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో వాటికి అడ్మిషన్ల కొరత సృష్టించి తల్లిదండ్రుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్నట్టు వెల్లడించారు. సీఎం రేవంత్ దగ్గర విద్యాశాఖ ఉన్నందున ఇంజినీరింగ్ రాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.