హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 3 విద్యాసంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా రీయింబర్స్‌మెంట్‌పై దాటవేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో చెల్లింపులు అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.