హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాలపై త్వరలో సినీ పెద్దలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎఫ్‌డీసీ) చైర్మన్, నిర్మా త దిల్ రాజు తెలిపారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండ గా ఉంటామని ప్రకటించారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. అ నంతరం మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటన ఎవరూ కావాలని చేసింది కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని తెలిపారు. చిత్ర పరిశ్రమను ప్రభుత్వ దూరం పెడుతుందనేది దుష్ప్రచారమని, ఇం డస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం చెప్పారని తెలిపారు. తాను అమెరికాలో ఉన్నందున ఇన్నిరోజులు రాలేకపోయానని, అమెరికా నుంచి రాగానే సీఎంను కలిశానని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఫుల్స్టాప్ పెడదామని చెప్పారు. రేవతి భర్త భాస్కర్‌కు ఫిల్మ్ ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. శ్రీతేజ్ పరిస్థితి మెరుగవుతున్నదని చెప్పారు. భాస్కర్ కూతురు బాధ్యతను తాను తీసుకుంటానని దిల్ రాజు ప్రకటించారు.
తన కుమారుడు పూర్తిగా కోలుకునేందుకు ఎన్నిరోజులు పడుతుందో స్పష్టంగా చెప్పలేమ ని వైద్యులు చెప్పారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. తమ వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నారనే బాధతో కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. తనపై ఎవరి ఒత్తిడి లేద ని, ఘటన జరిగిన రెండో రోజు నుంచి అల్లు అర్జున్ తమకు అండగా ఉన్నాడనే సానుభూతితోనే కేసును వెనక్కి తీసుకుంటున్నానని వివరించారు.