హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఆధ్వర్యం లో ఈ నెల 8న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న అధ్యాపకుల మహాసభకు పోలీసులు అనుమతులు రద్దుచేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అనుమతించడం లేదని ఫెడరేషన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్(ఫతి) చేసిన దరఖాస్తును నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం గురువారం తిరస్కరించింది. పోలీసుల నిర్ణయంపై ఫతి బాధ్యు లు గురువారం హైకోర్టును ఆశ్రయించగా శుక్రవారం విచారణ చేపట్టనున్నది.
ఎల్బీ స్టేడియం కాకపోతే సికింద్రాబాద్, ఉప్పల్, సరూర్‌నగర్ స్టేడియాల్లో నిర్వహణ అనుమతులివ్వాలని ప్ర భుత్వాన్ని కోరగా ఇందుకు కూడా అంగీకరించలేదు. దీంతో సభ నిర్వహణను అరోరా ఇంజినీరింగ్ క్యాంపస్‌కు మార్చాలని నిర్ణయించినట్టు ఫతి బాధ్యులు తెలిపారు. శుక్రవారం కోర్టు తీర్పు తో సభ నిర్వహణపై స్పష్టత రానున్నది.