పేగు బంధం.. మృత్యుపాశమై.. పిల్లలకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారుల వందేళ్ల జీవితాన్ని చిదిమేశాడు. కన్నబిడ్డల కు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో కలకలం రేపింది.
- ముగ్గురి ప్రాణాలు తీసిన కలహాలు
తొర్రూరు, ఏప్రిల్ 2 8: కుటుంబ కలహాలతో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారుల వందేళ్ల జీవితాన్ని చిదిమేశాడు. కన్నబిడ్డల కు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంషావలి(30)కి అదే గ్రామానికి చెందిన శాంతతో వివాహం జరిగింది. గుంషావలి తొర్రూరులో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ జరిగే గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో 15 రోజుల క్రితం జరిగిన గొడవతో శాంత తన ముగ్గురు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. గుంషావలి సోమవారం ఉదయం చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఇ ద్దరు చిన్నారులు విలాస్ (5), వికేశ్(3)ను తనవెంట తీసుకెళ్లాడు. తొర్రూరు శివారులోని ఖాళీ స్థలంలో వేపచెట్టుకు చిన్నారులకు ఉరేసి, అనంతరం తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక దవాఖానకు తరలించారు. శాంత ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఉపేందర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

