కొండాపూర్, మే 5: భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో శివారులో చోటుచేసుకున్నది. సీఐ వెంకటేశం కథనం ప్రకారం… కొండాపూర్ మండలం గారకుర్తికి చెందిన బాయికాడి సుభాష్ (45)కు కొడుకు మరియన్ (7), కూతురు ఆరాధ్య (5) ఉన్నారు. సుభాష్ సదాశివపేట మండలం ఆత్మకూర్ పీహె చ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నా డు. ఉద్యోగ రీత్యా మల్కాపూర్ చౌరస్తాలో నివాసం ఉంటున్నాడు. కుటుంబ కలహాలతో భార్య వారం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మనస్తాపం చెందిన సుభాష్ తన ఇద్దరు పిల్లలను బండ రాయితో కొట్టిచంపాడు. తర్వాత ఇతను ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.