Mulugu | ములుగు జిల్లా కర్లపల్లిలో విషాదం..లేగ దూడను కాపాడపోయి తండ్రీకొడుకుల మృతి
లేగదూడ కాపాడే ప్రయత్నంలో బావిలోకి దిగిన తండ్రీకొడుకులు కానరాని లోకాలకు వెళ్లిన హృదయ విదాకర ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కర్లపల్లికి చెందిన రసపుత్ రాజు(45) తన లేగదూడ ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న పాడుబడిన బావిలో పడింది.
- ములుగు జిల్లా కర్లపల్లిలో విషాదం
గోవిందరావుపేట, మే 9 : లేగదూడ కాపాడే ప్రయత్నంలో బావిలోకి దిగిన తండ్రీకొడుకులు కానరాని లోకాలకు వెళ్లిన హృదయ విదాకర ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కర్లపల్లికి చెందిన రసపుత్ రాజు(45) తన లేగదూడ ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న పాడుబడిన బావిలో పడింది. మూగ జీవి ఆర్తనాదాలు విని చలించిపోయిన రాజు తాడు కొట్టుకొని బావిలోకి దిగాడు. అప్పటికే మృతి చెందిన లేగదూడకు తాడు కట్టగా, తన పెద్ద కొడుకు రసపుత్ పవన్(24) పైకి లాగాడు.
లేగ దూడను బయటికి తీసిన చాలాసేపటి వరకు తండ్రి పైకి రాకపోవడంతో ఆందోళన చెందిన కుమారుడు కూడా బావిలోకి దిగాడు. ఇద్దరూ ఎంత సేపటికి బయటికి రాకపోవడాన్ని గమనించిన గ్రామస్తులు పాడు బడిన బావిలో చిక్కుకొని ఉంటారని గమనించి, బయటికి తీసే ప్రయత్నం చేయగా వారు అప్పటికే మృతి చెందారు. ములుగు డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్ ఘటనాస్థలానికి చేరుకొని బావిలో ఉన్న తండ్రీకొడుకుల మృతదేహాలను బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

