హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం చెందారు. గద్వాల మండలం అనంతపురంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీ కూతురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఇటిక్యాల మండలం మునగాల వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉన్నది.