రెంజల్, అక్టోబర్ 11: భారీ వరదలతో పంట నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా రెంజల్లో శనివారం రైతులు రాస్తారోకో చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో వందలాది ఎకారాల్లో సోయా, వరి, పత్తి, ఇతర పంటలు నీట మునిగి నష్ట పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించకపోతే భారీ ఉద్యమాన్ని లేవదీస్తామని హెచ్చరించారు.