Home
Telangana
Farmers Who Sold The Grain They Cultivated Through Months Of Hard Work Are Waiting For Payment
ధాన్యం డబ్బులేవి?.. పంట విక్రయించి 20 రోజులైనా జమచేయరా..?
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మూడు వారాలు దాటినా ఇంకా డబ్బులు చెల్లించక పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- వన్‌పల్లి రైతుల ఆందోళన
- కలెక్టరేట్ ముట్టడికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
వీర్నపల్లి, జూన్ 30 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మూడు వారాలు దాటినా ఇంకా డబ్బులు చెల్లించక పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లికి చెందిన 171 మంది రైతులు 15 లారీల వడ్లను ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించి 20 రోజులు గడిచినా రాకపోవడంతో విసిగిపోయారు.
మంగళవారం సిరిసిల్ల కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది. విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉన్నా.. ఎందుకు డబ్బులు వేయడం లేదని ప్రశ్నించారు. ఐకేపీ సీసీ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cultivation
- farmers
- grain
- payment
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

