నల్లగొండ సిటీ, నవంబర్ 8: ఐకేపీ సెంటర్లో ధాన్యం అమ్మకానికి ఉంచి 20 రోజులైంది.. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.. మ్యాచర్ పేరిట కాలయాపన జరుగుతుంది.. ఈ బాధలతో మేముంటే సంబురాలు చేసుకుంటారా? అంటూ నల్లగొండ జిల్లా కనగల్ మండలం జీ యడవల్లి గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గ్రామంలో ఏర్పాటుచేసిన సీఎం రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలను రైతులంతా అడ్డుకున్నారు.