అన్నదాత కుటుంబానికి అండగా
పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నేనున్నానంటూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ‘రైతుబీమా’ పథకంతో కొత్త జీవితాన్ని ఇస్తున్నది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 15న ఈ పథకానికి శ్రీకారం
- రైతుబీమాతో సీఎం ఆర్థిక భరోసా
- కుటుంబానికి 5 లక్షల పరిహారం
- నేటితో పథకానికి నాలుగేండ్లు
- 85 వేల కుటుంబాలకు బాసట
- 4,290 కోట్ల పరిహారం చెల్లింపు
- పథకం పరిధిలోకి మరో 3 లక్షలు
- రూ.1,446 కోట్ల ప్రీమియం చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నేనున్నానంటూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ‘రైతుబీమా’ పథకంతో కొత్త జీవితాన్ని ఇస్తున్నది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 15న ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. నేటి (సోమవారం)తో నాలుగేండ్లు పూర్తిచేసుకొంటున్న ఈ పథకం కింద 18 నుంచి 59 ఏండ్ల వయసున్న రైతు పేరిట కనీసం కుంట భూమి ఉండి ఏ కారణంతో మరణించినా ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతున్నది.
ఇలా గత నాలుగేండ్లలో వివిధ కారణాలతో మరణించిన 85,804 మంది రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తగా రూ.4,290 కోట్ల పరిహారం చెల్లించింది. ఈ పథకం కోసం ఎల్ఐసీకి రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఏటా ఒక్కో రైతు తరఫున రూ.4 వేలు చొప్పున గత నాలుగేండ్లలో రూ.4,367 కోట్ల ప్రీమియం చెల్లించింది. ఏటా ప్రీమియం పెరుగుతుండటంతో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతున్నది. ఈ ఏడాది 37.76 లక్షల మంది రైతుల కోసం రూ.1,446 కోట్ల ప్రీమియంను చెల్లించనున్నది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది రైతులు కొత్తగా రైతుబీమా పథకం పరిధిలోకి రావడం గమనార్హం.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

