నల్లగొండ : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో డి 40, డి 39 కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. నాగార్జునసాగర్ నుండి 26 గేట్ల ద్వారా నీళ్లు పోతున్నప్పటికీ జిల్లా మంత్రులు, శాసనసభ్యులు కనీసం అవగాహన లేకుండా నల్లగొండ జిల్లాను ఎండ పెడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉదయ సముద్రం 1.5 టిఎంసి పూర్తిస్థాయిలో నింపి ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువులు నింపి, రైతులకు పంటల కోసం నీరు అందించాలని డిమాండ్ చేశారు. అధికారులు వారాబంది పేరుతో ఐటిపాముల కాలువకు వారం రోజులు నీళ్లు వదులుతున్నారు.
కానీ, తిప్పర్తి మండలంలోని D 40, D 39 కాల్వకు వారబంది అమలు చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు కాలువ వెంట తిరిగి అన్ని చెరువులను నింపే విధంగా ప్రయత్నం చేయాలన్నారు.
అధికార పార్టీ నాయకులు కళ్లు తెరిచి రాజకీయాలు పక్కన పెట్టి తిప్పర్తి మండలం లోని చెరువుల నింపే విధంగా అధికారుల పైన స్థానిక మంత్రిపైనా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజానీకాన్ని ఆదుకోవాలని కోరారు.
ఆదివారం వరకు పూర్తిస్థాయిలో కాలువలు వదలక పోతే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రైతులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో..మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కందుల లక్ష్మయ్య, సిపిఎం మండల కార్యదర్శి మన్నెం బిక్షం, రైతులు గుండెబోయిన రామచంద్ర, గుండేబోయిన సైదులు, రొట్టెల జానయ్య, దేవి రెడ్డి లింగారెడ్డి, చింతకుంట్ల దయాకర్ రెడ్డి, నూకల ప్రవీణ్, రావుల సందీప్, నూకల రాజీవ్, బైరగోని శ్రీను జాకటి బాలయ్య, కట్ట కిట్టు, గుండు రవి, జానీ పాషా, కస్పరాజు వెంకన్న, రొట్టెల సైదులు, మర్రి వెంకన్న, దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.