నూతన యాజమాన్య పద్ధతులు పాటించాలి : మంత్రి పువ్వాడ
హైదరాబాద్ : రైతులు నూతన యాజమాన్య పద్ధతులు పాటించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎస్సార్ గార్డెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు చెందిన వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, రైతులతో నిర్వహించిన వానాకాలం-2022 సాగు సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. అధికారులు యజమాన్య పద్ధతులు, పంటలు వేయాల్సిన పద్ధతులు, వాడాల్సిన ఎరువులు, రసాయనాలపై రైతులకు తెలియజెప్పాలన్నారు.
వ్యవసాయశాఖలోని అన్ని పోస్టుల భర్తీకి చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అనీ, రాష్ట్రంలో వ్యవసాయాన్ని బలోపేతం చేయమని వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏవోలను కోరిన ఏకైక సీఎం అన్నారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని ఏఈవోలు రైతులను చైతన్యం చేయాలని, ఖమ్మం వ్యవసాయంలో ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ముందున్న జిల్లా అన్నారు. పంట వైవిద్యీకరణలో ఖమ్మం ముందున్నదని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రైతు వేదికలో నిరంతర కార్యక్రమాలు జరుగాలన్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఏ పంటలు వేయాలి? వ్యవసాయాన్ని ఎలా లాభదాయకంగా చేసుకోవాలి? అన్న పరిస్థితి 2014కు ముందు లేకుండేదని, వ్యవసాయశాఖను పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు.
గత పాలకులు పూర్తిగా విస్మరించారని, 2014 తర్వాత సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయశాఖలో ఖాళీలు భర్తీ చేశారని, వ్యవసాయశాఖకు రైతుల్లో గౌరవం పెంచారన్నారు. రైతుబంధు సమితులకు ప్రోత్సాహం అందిస్తాం.. వారికి ప్రభుత్వ కార్యక్రమాల్లో గుర్తింపు ఇస్తామన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో రైతుల గురించి ఆలోచించింది కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వమే సాగునీరు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నారన్నారు. రైతులు ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి సారించాలన్నారు. ఆయిల్ పామ్ సాగును ఉమ్మడి ఖమ్మంలో మరింత విస్తృతంగా సాగు చేయాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

