నిజామాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ(Loan waiver) చేశామని గొప్పలు చెప్పుకుంటుండగా మరోపక్క అర్హులైన రైతులు రుణమాఫీ అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుక వచ్చిన రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ పథకం పలువురు రైతులకు రుణ మాఫీ కావడం లేదు. దీంతో సదరు రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా
నిజామాబాద్( Nizamabad) జిల్లా రెంజల్ మండలంలో రుణమాఫీ కాలేదని రైతు కుటుంబాలు ఆందోళనకు (Farmers protest) దిగాయి. రెంజల్ మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ ఎదుట తాము తీసుకున్న రుణాలకు మాఫీ ఎందుకు కాలేదు అంటూ బ్యాంకు ముందట రైతులు బైఠాయించారు. బ్యాంక్ అధికారులను అడిగితే తమకేమీ సంబంధం లేదని చెప్తున్నారని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.