కొనసాగుతున్న యూరియా ఆందోళనలు.. సూర్యాపేట జిల్లా ఖానాపురంలో పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన
యూరియా స్టాక్ అంతా క్షణాల్లోనే మాయమైపోతుండటంతో అనుమానాలు వ్య క్తంచేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రైతులకు నిరసనకు దిగారు.
- కరీంనగర్ జిల్లా కొండపల్కలలో సైతం రైతుల నిరసనలు
అనంతగిరి/మానకొండూర్రూరల్, ఫిబ్రవరి 13: యూరియా స్టాక్ అంతా క్షణాల్లోనే మాయమైపోతుండటంతో అనుమానాలు వ్య క్తంచేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రైతులకు నిరసనకు దిగారు. కోదాడ-అనంతగిరి రోడ్డుపై పురుగుల మందు డబ్బాలతో బైఠాయించారు. అనంతరం ఖానాపురం పీఏసీఎస్ ఆవరణలో వ్యవసాయ అధికారులను నిలదీశారు.
సంఘ పరిధిలోకి 444 యూరియా కట్టలు ఆన్లైన్లో పెడతామన్న సమయానికి కాకుండా ఆలస్యంగా ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి సీజన్లో యూరియా విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
కొండపల్కలలో రైతుల అవస్థ
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామంలోని వెంకటసాయి ఫర్టిలైజర్ షాపు వద్ద సుమారు 350 మంది రైతులు శుక్రవారం యూరియా కోసం పడిగాపులు కాశారు. షాపులోకి 220 బస్తాలు వచ్చినట్టు సమాచారం రావడంతో పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. యాప్ ఓటీపీ కోసం ఎదురు చూడటానికే సమయం వృథా అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. యాప్ ద్వారా కాకుండా పాతపద్ధతిలో బస్తాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

