మాచారెడ్డి, నవంబర్ 14: పని చేయని ఈ తహసీల్దా ర్ తమకు వద్దంటూ రైతులు ఆందోళనకు సిద్ధమయ్యా రు. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు వచ్చి రైతులకు సర్దిచెప్పి తహసీల్దార్‌పై బదిలీవేటు వేశారు. ఈ ఘటన గురువారం కామారెడ్డి జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది. పాల్వంచ తహసీల్దార్ జయంత్‌రెడ్డి ఏడాది నుంచి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా, భూములు రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తున్నాడని ఆగ్రహానికి లోనైన రైతులు తహసీల్ ఆఫీస్ ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారు. తహసీల్దార్ జయంత్‌రెడ్డి తమకొద్దని పేర్కొంటూ ఆందోళనకు సిద్ధమవుతుండగా.. సమాచారం అందుకున్న అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో రంగనాథ్ హుటాహుటిన అ క్కడకు చేరుకున్నారు.
రైతులతో మాట్లాడి ధర్నా చేయొద్దని, సమస్యలేమైనా ఉంటే చెప్పాలని కోరారు. ఏడాది కాలంగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని, భూముల రిజిస్ట్రేషన్లు చేయకుండా వేధిస్తున్నాడని రైతులు తెలిపా రు. తమ సమస్యలపై ఆఫీస్‌కు వచ్చి చెప్పుకున్నా స్పం దించడం లేదని వాపోయారు. స్పందించిన అదనపు కలెక్టర్ విక్టర్.. తహసీల్దార్ జయంత్‌రెడ్డిని తప్పించి, ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు జయంత్‌రెడ్డి దీర్ఘకాలిక సెలవు పెట్టినట్టు తెలిసింది.