భీమిని, జూలై 14 : యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవా రం నిరసన చేపట్టారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈ వో రాజేశ్వర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది యూరియా పంపిణీని నిలిపివేశారు. పోలీసులు, ఏడీఏ సురేఖ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. కలెక్టర్ దృష్టికి సమస్య ను తీసుకుని వెళ్తానని రైతులు ఆందోళన చెందవద్దని సముదాయించారు.
రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం సమర్పించారు.
రైతులు పత్తి, మకజొన్న, వరి తదితర పంటలకు కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియాను కలిపి వాడతారని అయితే 15 రోజులుగా యూరియా కోసం సొసైటీల వద్ద బారులు తీరుతున్నారని, సరిపడా ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు.