శాయంపేట, ఫిబ్రవరి 16 : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులో ఉన్న చలివాగు ప్రాజెక్టు దేవాదుల పంపుహౌస్ వద్ద ఆదివారం రైతులు నిరసన తెలిపారు. దేవాదుల పంప్‌హౌస్ నుంచి ధర్మసాగర్‌కు నిరంతరం నీటిని పంపిణీ చేస్తుండటంతో చలివాగులో బ్యాక్ వాటర్ అడుగంటి పోతున్నాయని ఆందోళన చేపట్టారు.
చలి వాగు పరిసర ప్రాంతాలైన హుస్సేన్‌పల్లి, మైలారం, వసంతాపూర్, పత్తిపాక తదితర గ్రామాల రైతులు చలివాగు పంప్‌హౌస్ వద్దకు చేరుకొని దేవాదుల మోటర్లను ఆఫ్ చేయాలని నిరసనకు దిగారు.