గోపాల్పేట, జనవరి 18 : విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభించినా.. సరఫరా చేయడంలేదని శనివారం వనపర్తి జిల్లా ఏదుట్ల సబ్‌స్టేషన్ వద్ద రైతులు నిరసనకు దిగారు. 1.96 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఈ నెల 9న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించినా.. సరఫరా లేదని మండిపడ్డారు. లోవోల్టేజీ సమస్యను కేసీఆర్ ప్రభుత్వంలో నాటి వ్యవసాయ శాఖ మం త్రి నిరంజన్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లగా.. సబ్‌స్టేషన్‌ను మంజూరు చేశారని గుర్తుచేశారు. ఏఈ హర్షవర్ధన్‌రెడ్డిని వివరణ కోరగా.. సబ్‌స్టేషన్ తమకు అప్పగించలేదని, ఆపరేటర్లు అలాట్ కాలేదని, మంగళవారం వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధ రిస్తామని చెప్పారు.
చెరువులు నింపాలని రైతుల దీక్ష
రాజాపేట, జనవరి 18 : కాళేశ్వరం ప్రాజెక్టు 15వ ప్యాకేజీ ద్వారా యా దాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మం డలంలోని గొలుసుకట్టు చెరువులు నింపి సాగుకు నీటిని అందించాలని డి మాండ్ చేస్తూ రాజాపేట మండల కేం ద్రంలో రైతు జేఏసీ నాయకులు శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతు జేఏసీ కన్వీనర్ ఎర్రగోకుల జశ్వంత్ మాట్లాడుతూ.. మండలంలోని చెరువులన్నీ నీళ్లు లేక వట్టిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాళేశ్వరం 15వ ప్యాకేజీ ద్వా రా చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. చెరువులు నింపేవరకు దీక్షలు కొనసాగుతాయని హెచ్చరించారు.