యాచారం, జూన్ 4: వ్యవసాయ రుణాన్ని ఇంకెప్పుడు మాఫీ చేస్తారంటూ రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రసంగించిన అనంతరం రైతులు తమకు రుణమాఫీ కావడంలేదని అధికారుల ముందు ఎమ్మెల్యేను నిలదీశారు.
ఇప్పటికే చాలామందికి రుణమాఫీ అయిందని కొన్ని కారణాల వల్ల కొంతమందికి కాలేదని ఎమ్మెల్యే రైతులకు సర్దిచెప్పారు. వెంటనే వ్యవసాయ అధికారి స్పందిస్తూ సమస్య యాచారం మండలంలోనే లేదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నదని, దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కొందరు మహిళలు వేడుకున్నారు.