ఆళ్ళపల్లి, ఫిబ్రవరి 4 : అప్రకటిత విద్యుత్తు కోతలపై అన్నదాతలు ఆగ్రహించారు. కోతలు, లోవోల్టేజీ సమస్యపై బుధవారం విద్యుత్తు శాఖ అధికారులను ప్రశ్నిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలోని సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. యాసంగిలో వరి, మిర్చి, మక్కజొన్న పంటలు సాగు చేశామని, కరెంటు కోతలతో పంటలు దెబ్బతింటున్నాయని అధికారులను నిలదీశారు.
ఒక దశలో అధికారులు, రైతుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. మూడు రోజులకోసారి మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, లైన్ మరమ్మతులు అంటూ గంటలతరబడి విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంపై మండిపడ్డారు.