కరీంనగర్ రూరల్, నవంబర్ 8: ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసంపై కరీంనగర్ నగర శివారులోని తీగలగుట్టపల్లి రైతులు కన్నెర్రజేశారు. బస్తాకు 40.600 కిలోలు తూకం వేయాల్సిన నిర్వాహకులు, కిలోన్నర వడ్లు అదనంగా తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిని నిలదీశారు.
మమ్మల్ని ముంచొద్దని, తాలు పేరిట మరీ ఇంత మోసం చేస్తారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఒరిగిందేమీ లేదని, ఎక్కడ చూసినా తీరని అన్యాయమే జరుగుతుందని మండిపడ్డారు. కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, కాశెట్టి శ్రీనివాస్, మూల రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.