అన్నం పెట్టే రైతన్నలను హత్య చేసిన ఘనత బీజేపీకే దక్కింది. ఉత్తరప్రదేశ్లో నలుగురు అన్నదాతల హత్య బీజేపీ వినాశనానికి నాంది. ఈ ఘటన మన ప్రాంతంలో జరిగితే ఎలా ఉంటుందో, ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. టీఆర్ఎస్ రైతుల పార్టీ. సీఎం కేసీఆర్ రైతన్నకు మేలు చేసే రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలను అమలుచేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏంచేసిందో ప్రజలకు చెప్పాలి. బీజేపీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి. రైతులు గుంపులుగా కనబడితే రాళ్లు, కర్రలతో కొట్టండని, కొట్టిన వారిని నాయకులను చేస్తానని హర్యానా సీఎం మాట్లాడటం సిగ్గుచేటు.