నాటి ప్రోత్సాహం నేడేది?
గత బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ రంగంలో కొత్త కొత్త ప్రయోగాలు జరిగాయి. ముఖ్యంగా ఉద్యాన, వాణిజ్య పంటల సాగు విషయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
- కేసీఆర్ హయాంలో పంట మార్పిడిలో ప్రయోగాలు
- రేవంత్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలే
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ రంగంలో కొత్త కొత్త ప్రయోగాలు జరిగాయి. ముఖ్యంగా ఉద్యాన, వాణిజ్య పంటల సాగు విషయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆయిల్‌పామ్, ఆపిల్, డ్రాగన్‌ఫ్రూట్, అవకాడో వంటి పంటలకు భారీ చేయూత లభించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు కూడా సంప్రదాయ వరి, పత్తి పంటలతోపాటు ఉద్యాన, వాణిజ్య పంటలపై మొగ్గుచూపారు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించారు.
ముఖ్యంగా తక్కువ నీటితో ఉద్యాన పంటలను సాగు చేసి ఎక్కువ లాభాలు పొందవచ్చని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రుజువు చేసింది. దీంతో రైతులు కరోనాలాంటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకొని నిలబడ్డారు. కానీ ప్రస్తుతం అలాంటి ప్రణాళికలు గానీ, ప్రోత్సాహం గానీ కనిపించడం లేదు. ఎల్ నినో దూసుకొస్తున్నదని, దీని ప్రభావం ఎక్కువ రోజులు కొనసాగుతుందని, ముఖ్యంగా తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకావొచ్చని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకున్న రాష్ర్టాలు ప్రస్తుతం నిలబడ్డాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రస్తుత తాగు, సాగునీరు, కరెంట్ సమస్య తీవ్రమైనదని నిపుణులు చెప్తున్నారు. ఉద్యాన పంటలైన బత్తాయి, నిమ్మ సాగు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నదని తెలిపారు.
కేసీఆర్ హయాంలో వచ్చిన మార్పుల్లో కొన్ని..
- బీఆర్ఎస్ పాలనలో అత్యధిక ప్రాధాన్యత లభించిన వాణిజ్య పంట ఆయిల్ పామ్. తెలంగాణలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని కేసీఆర్ సంకల్పించారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు మొదటి సంవత్సరంలో ఎకరాకు రూ. 26వేలు, రెండు, మూడవ సంవత్సరాల్లో రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించారు. దీంతో పాటు బిందు సేద్యానికి భారీగా సబ్సిడీలు ఇచ్చారు. దీంతో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం సుమారు 1.5 లక్షల ఎకరాల నుంచి దాదాపు 3 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు, కోకో సాగు చేస్తూ ఎకరాకు రూ. లక్ష వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ఖమ్మం, వనపర్తి, గద్వాల, సూర్యాపేట, సిద్దిపేట వంటి జిల్లాల్లో దీని సాగు ఆశాజనకంగా ఉన్నది.
- సాధారణంగా చల్లని వాతావరణంలో పెరిగే ఆపిల్ పంటను తెలంగాణ వాతావరణానికి అనుకూలంగా పండించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి తకువ చలిలో కాసే ‘హరిమన్-99’ వంటి ప్రత్యేక ఆపిల్ రకాలను పండించేలా ఉద్యాన శాఖ ప్రయత్నించింది.
- రాష్ట్రంలో పప్పుధాన్యాలు, కూరగాయల కొరతను అధిగమించడానికి ప్రభుత్వం పంటల వైవిధ్యీకరణ కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించింది. ఉద్యానవన పంటలు (పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు) వేసే రైతులకు అదనపు ప్రోత్సాహకాలు అందించింది.
అవకాడో, డ్రాగన్ ఫ్రూట్..
మారెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న అవకాడో (బట్టర్ ఫ్రూట్), ఆంజీర్, డ్రాగన్‌ఫ్రూట్ వంటి అధిక ఆదాయం ఇచ్చే పండ్ల తోటల వైపు రైతులను మళ్లించేందుకు నాటి ప్రభుత్వం ప్రయత్నించింది.
స్టీవియా (సహజ తీపి మొక) సాగు..
షుగర్ (చకెర) వ్యాధిగ్రస్తులు ఎకువగా వాడే స్టీవియా (Stevia) మొకల సాగు వైపు కూడా కొందరు రైతులు కొత్తగా అడుగులు వేసేందుకు బీఆర్ఎస్ దారి చూపింది. ఆహార, ఔషధ పరిశ్రమల్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉండటం, తకువ నీటితోనే సాగవడం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

