చిన్నంబాయి, నవంబర్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం అయ్యవారిపల్లి, వెల్టూరు, చిన్నమారు, పెద్దమారు, కొప్పునూరు గ్రామాల్లోని వరి చేళ్లను మాజీ ఎమ్మెల్యే బీరం పరిశీలించి మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండేనని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్లలోనే అన్నదాతలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వానకాలంలో రైతులకు కనీసం ఎరువులను అందించలేని దయనీయ పరిస్థితిలో సర్కార్ ఉన్నదని విమర్శించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.