పొతంగల్, అక్టోబర్ 25: కొనుగోలు కేం ద్రంలో కాంటా వేసి తరలించిన సోయాలను ఐదు రోజుల తర్వాత తిప్పి పంపడంపై రైతు లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జి ల్లా పొతంగల్ మండలంలోని హెగ్డోలి సొసైటీ ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు.
తేమశాతం చూశాకే కొన్నారని, ఇప్పుడేమో బాలేవని తిప్పి పంపించడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం బేషరతుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
నూతనంగా నిర్మించనున్న రైల్వే గూడ్స్ లైన్ను రద్దు చేయాలని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్, ఎలుకుర్తి, ఉనికిచర్ల గ్రామాల రైతులు శుక్రవారం మండలం సమీపంలోని ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. కేంద్రప్రభుత్వం, రైల్వే శాఖ స్పందించి, ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు.
-ధర్మసాగర్,