బెజ్జూర్, అక్టోబర్ 25 : ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో పంటలు నష్టపోయామని, వెంటనే పరిహారం చెల్లించాలని శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో రైతులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయ అధికారుల తప్పిదంవల్లే తీవ్రంగా నష్టపోయామని, నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కౌటాల సీఐ ముత్యం రమేశ్ రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం తహసీల్దారు భూమేశ్వర్‌కు వినతిపత్రం అందించారు.
బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి ; ప్రజాభవన్ ఎదుట గురుకుల అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత నోటిఫికేషన్లోనే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చే యాలని గురుకుల అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ ఎదుట ఆందోళన కు దిగారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ ని నాదాలతో హోరెత్తించారు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి ఈ పోస్ట్‌లను అర్హులతో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.