పెనుబల్లి, జూలై 1 : రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న యూరియా యాప్ను వెంటనే బంద్ పె ట్టాలని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశునిపాడు గ్రామానికి చెందిన రైతు లగడపాటి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఒరిగిందేమీ లేదని అన్నాడు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శా ఖ మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి ఇదే జిల్లాకు చెంది న వారని పేర్కొన్నా డు. మంత్రి తుమ్మలకు రైతుల బాధల న్నీ తెలుసని అన్నాడు. అయినా రైతులు యూరియా కోసం పడే బాధలను అర్థం చేసుకోవడం లేద ని ఆవేదన వ్యక్తంచేశాడు. రైతుల బాధలను అర్థం చేసుకొని యాప్ను బంద్ చేసి, ఆధార్ కార్డు ద్వారా యూరియా అందించాలని ఆ వీడియోలో వేడుకున్నాడు.