HomeTelanganaFarmers Demand That The Government Should Buy Dry Grain
వడ్లు కొంటేనే ఓటు..
నిరసిస్తూ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కునుముక్కుల గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. 20రోజులుగా వడ్లు కాంటా వేయలేదంటూ తడిసిన బస్తాలతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో 8గంటల వరకు కేవలం 43 ఓట్లే పోలయ్యాయి. తాసిల్దార్, అధికారులు వచ్చి కొంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవడాన్ని
తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలి
యాదాద్రి కనుముక్కులలో రైతుల ఆందోళన
భూదాన్ పోచంపల్లి, మే 13: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని కనుముక్కులలో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సోమవారం రైతులు ధర్నా చేసి గంటపాటు ఎన్నికలను బహిష్కరించారు. ధర్నాతో ఉదయం 8 గంటల వరకు 43 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. రైతులు మాట్లాడుతూ కాంటా వేసిన ధాన్యాన్ని నాలుగు రోజులుగా తరలించకపోవడంతో వర్షానికి బస్తాలు తడిచి ముద్దయ్యాయని, మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2,800 బస్తా ల ధాన్యం ఉన్నదని, 20 రోజుల క్రితం వడ్లు తీసుకొచ్చినా నేటికీ కాంటా వేయలేదని, రవాణా సౌకర్యం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ధాన్యం బస్తాలను తరలించేందుకు లారీలను పంపిస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించి ఓటింగ్‌లో పాల్గొనేందుకు అంగీకరించారు. ధర్నా లో వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్‌యాదవ్, రైతులు పాక నరసింహ, నూకల లింగస్వామి, కొండల్‌రెడ్డి, కోట రామచంద్రారెడ్డి, చుక రవి, కొత్త లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.