మహబూబ్నగర్ : కష్టపడి తెచ్చిన పంటకు రైతులకు లాభం చేసేది పోయి రైతులకే నష్టం చేస్తున్న వైనంపై అన్నదాతలు కన్నెర్రజేశారు. మహబూబ్నగర్ మార్కెట్ యార్డులో పల్లికి గిట్టుబాటు ధర(Groundnut crop) కల్పించాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన(Farmers concern )చేపట్టారు. పరిస్థితి ఉధృతంగా మారింది. సమీపంలో ఉన్న బోయపల్లి గేట్ రైల్వే పట్టాలపై నిరసన తెలియజేయడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను శాంతింపజేసే యత్నం చేశారు. అయినా రైతులు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
మహబూబ్నగర్ మార్కెట్ యార్డు వందల క్వింటాళ్ల వేరుశనగను అమ్ముకోవడానికి తీసుకోవచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర రాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు, ట్రేడర్లు కుమ్మక్కు అయి ధరలు తగ్గించారని రైతులు ఆరోపించారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. రైతుల ఆందోళనతో మార్కెట్ అధికారులు అక్కడ నుంచి జారుకున్నారు.