హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాతీయ వ్యవసాయ మారెటింగ్ విధానం(ఎన్పీఎఫ్ఎం) ముసాయిదాను వెనకి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ప్రజల్లో చైతన్యం కలిగించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, అరిబండి ప్రసాదరావు, నున్నా నాగేశ్వరరావు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, జయరాజు, శివతో కలిసి ప్రచార పోస్టర్‌ను ఆవిషరించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ గతంలో రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను మారెట్ విధానాల రూపంలో రైతులపై రుద్దేందుకు కేంద్రం యత్నిస్తున్నదని ఆరోపించారు. దేశ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మారెటింగ్ విధానాల ముసాయిదాను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలు, నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి సమగ్ర మారెటింగ్ విధానాన్ని తీసుకురావాలని, రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని టీ సాగర్ సూచించారు.
‘తెలంగాణలోనూ ఓపీఎస్ అమలు చేయాలి’
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో కర్ణాటకలో జరిగిన ఉపవాస సత్యాగ్రహ దీక్షలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామ య్య ఓపీఎస్‌ను అమలు చేసేందుకు చర్య లు తీసుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలిత రా్రష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ ఇది వరకే ఓపీఎస్‌ను అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలని శుక్రవారం ఒక ప్రకటనలో సీఎంను స్థితప్రజ్ఞ కోరారు.