మర్రిగూడ, నవంబర్ 7 : కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా పత్తి కొనడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని సరంపేట హరిహర కాటన్మిల్లు, యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీ నర్సింహస్వామి కాటన్మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తాము పత్తిని తీసుకొచ్చిన కొనడం లేదంటూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. సరంపేటలో రోడ్డుకు అడ్డంగా పత్తి ట్రాక్టర్లను పెట్టి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా నిర్వాహకులు కొనడం లేదని మండిపడుతున్నారు. మిల్లు యాజమాన్యం, మార్కెటింగ్ అధికారులు కుమ్మక్కై దళారులు తెచ్చిన పత్తినే కొంటున్నారని ఆరోపించారు.