జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి మండలాల్లో దాదాపు 50 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం బీర్పూర్ మండలంలో రూ.136 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టును 95 శాతం పూర్తి చేసింది. దీనికి షెటర్లు బిగించేందుకు అటవీశాఖ అనుమతి సాధించలేక 15 నెలలుగా కాంగ్రెస్ సర్కారు చేష్టలుడిగి చూస్తున్నది.
ఫలితంగా తూము నుంచి ఎస్సారెస్పీ నీరు వృథాగా పోతూ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నది.