సన్నాల సాగు.. భలే బాగు
కాలానుగుణంగా తకువ కాలంలో మంచి దిగుబడి వస్తున్న రకాలను కంపెనీలు మారెట్లోకి తీసుకురావడంతో సన్నాల సాగుపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ప్రధానంగా రెండు సీజన్లలోనూ సన్నా లు సాగు చేస్తే మంచి దిగుబడి వస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా ఆ రకమైన వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
- జీనెక్స్ సీడ్స్‌కు రెండేండ్లుగా డిమాండ్
- అయాన్ వెరైటీతో అధిక లాభాలు
- తకువ కాలం.. దిగుబడులు అధికం
- మిల్లులోనే పచ్చిధాన్యం అమ్ముకొనే వీలు
- అన్నదాతల నుంచి లభిస్తున్న ఆదరణ
నల్లగొండ, జూన్ 11 : కాలానుగుణంగా తకువ కాలంలో మంచి దిగుబడి వస్తున్న రకాలను కంపెనీలు మారెట్లోకి తీసుకురావడంతో సన్నాల సాగుపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ప్రధానంగా రెండు సీజన్లలోనూ సన్నా లు సాగు చేస్తే మంచి దిగుబడి వస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా ఆ రకమైన వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అందులో భాగంగానే జీనెక్స్ కంపెనీ కి చెందిన అయాన్ అనే వెరైటీ రెండేండ్లుగా, రెండు సీజన్లలో మంచి దిగుబడి ఇస్తూ రైతుల కు లాభాలు సాధించి పెడుతున్నది. వానకా లం, యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా రై తులు ఎకువగా వరిని సాగు చేస్తుండగా అందులో రెండు సీజన్లలో కలిసి వచ్చే ఈ వెరైటీకి బాగా డిమాండ్ ఉన్నట్టు రైతులు పేరొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వెరైటీకి ఇటీవల కాలంలో మంచి డిమాండ్ ఏర్పడింది.
ప్రధానంగా నల్లగొండ జిల్లాలో ఈ రకాని కి మంచి ఆదరణ ఉన్నట్టు తెలుస్తున్నది. ఇ కడ నాగార్జునసాగర్, మూసీ, శ్రీరాంసాగర్ ఆయకట్టులో సాగునీరు వస్తుండటంతో రైతు లు వరిని ఎకువగా సాగుచేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఆధునీకరించిన రైస్ మిల్లులు పెద్ద ఎత్తున ఉండటంతో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినా, చేయకపోయినా ఈ సన్నాలను సాగు చేసి అధిక ధరకు మిల్లుల్లో విక్రయిస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగినట్టు రైతులు చెప్తున్నారు.
అయాన్ వెరైటీ రెండు సీజన్లలో సాగుకు అనుకూలంగా ఉండటంతోపాటు తకువ కాలంలో ఎకువ దిగుబడి వస్తున్నందున రైతులు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది. గతంలో యాసంగిలో దొడ్డు రకం సాగుచేసేవారు. ఇటీవల ఇలాంటి సన్న వెరైటీలు మారెట్లోకి రావడంతో ఎకువగా సాగు చేస్తున్నారు. విత్తన కంపెనీలు కొన్నేండ్లుగా సన్నరకం ధాన్యం విషయంలో నాణ్యమైన విత్తనాలు తయారు చేస్తున్నాయి. అధిక దిగుబడి, పెట్టుబడి తకువ, పంట కాలం కూడా తకువ ఉండేలా విత్తనాలను మారెట్లో అందుబాటులో ఉంచాయి.
జీనెక్స్ అయాన్‌కు పెరిగిన డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా ఏటా సాధారణంగా రైతులు వానకాలంలో ఎకువగా సన్నాలు, యాసంగిలో దొడ్డు రకాలు సాగు చేస్తుంటారు. కాలానుగుణంగా కొన్ని కంపెనీలు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వానకాలంతోపాటు యాసంగిలోనూ తకువ కాలంతో అధిక దిగుబడి వచ్చేలా సన్నాలను బ్రీడింగ్ చేసి విక్రయించడంతో రైతులు ఆసక్తి చూపుతూ రెండు సీజన్లలోనూ సాగు చేస్తున్నారు . రెండేండ్ల క్రితం మారెట్లోకి వచ్చిన జీనెక్స్ సీడ్స్ కంపెనీకి చెందిన అయాన్ రకం వరి విత్తనాలకు డిమాండ్ పెరగడానికి.. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా పలు కారణా లున్నాయని అంటున్నారు.
ప్రధానంగా ఈ రకం విత్తనాలు సాగు చేస్తే వరి తకువ ఎత్తులో పెరుగుతుంది. దీంతో గాలి, వానలు వచ్చినప్పటికీ వరి నేలకొరగకుండా ఉంటుం ది. అంతేగాకుండా ధాన్యం సన్నగా ఉంటుం ది. అత్యధిక పిలకలు వేస్తుంది. సాధారణంగా ఇతర రకమైతే ఒకో వరి దుబ్బకు 15 నుంచి 25 పిలకలు పెడుతాయి. అదే అయాన్ రకమైతే ఏకంగా 30 నుంచి 40 పిలకల వరకు వృద్ధి చెందుతుంది. దీంతో దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఎకరానికి సుమారు 55 బస్తాల నుంచి 60 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. ఖర్చు కూడా చాలా తకువ. చీడపీడలను తట్టుకునే శక్తి ఇతర వంగడాలతో పోలిస్తే అయాన్ వంగడంలో ఎక్కువగా ఉన్నది.
ఈ రకం వంగడాన్ని ఎలాంటి నేల లోనైనా సాగు చేయవచ్చు. అయాన్ రకం సాగు చేస్తే 130 నుంచి 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 15 కిలోల విత్తనాలు సాగు చేసేందుకు సరిపోతున్నాయి. దీంతో రైతులు అయాన్ రకం ధాన్యం సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మారె ట్లో ఈ రకం ధాన్యానికి తేమ శాతం 28 నుంచి 30 శాతం ఉన్నప్పటికీ మారెట్లో క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,700కు కొనుగోలు చేస్తున్నారు. పొలంలో కోత కోయగానే పచ్చిధాన్యాన్ని కూడా విక్రయించే అవకాశం ఉండటం రైతులకు కలిసి వచ్చే అవకాశం. అయాన్ రకం ధాన్యంలో ఆయిల్ శాతం ఎకువగా ఉండటంతో తినడానికి రుచిగా ఉంటుంది. ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయిస్తే మా రెట్లో క్వింటాకు రూ.3,600 నుంచి రూ.4 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు.
అయాన్ వెరైటీతో దిగుబడి పెరిగింది
గత రెండు సీజన్లుగా నేను జీనెక్స్ సీడ్స్‌కు సంబంధించిన అయాన్ అనే వెరైటీని సాగు చేస్తున్నా. క్రితం సారి వాన కాలంలో కూడా రెండు ఎకరాలు సాగు చేయడంతో ఎకరానికి 60 బస్తాలు చొప్పున మొత్తం 120 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.2,650 చొప్పున మిల్లర్లు నాకు డబ్బులు ఇచ్చారు. దీనివల్ల నాకు ఖర్చు, శ్రమ తగ్గింది. తక్కువ కాలంలో పంట చేతికి వచ్చింది. తొందరగా అమ్ముకున్నా.
– అనుముల మట్టారెడ్డి, త్రిపురారం, నల్లగొండ జిల్లా
సన్నాలతో మంచి లాభాలు ఉన్నాయి
కాలానుగుణంగా కొన్ని కంపెనీలు తకువ కాలంలో మంచి దిగుబడి వచ్చేలా సన్నరకాలకు సంబంధించిన వెరైటీలను బ్రీడింగ్ చేసి మారెట్లో విక్రయిస్తున్నారు. పలు కంపెనీలకు చెందిన వెరైటీలతోపాటు జీనెక్స్ కంపెనీకి చెందిన అయాన్ అనే వెరైటీ మంచి దిగుబడి వస్తున్నదని రైతులు చెప్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఆధునీకరించిన రైస్ మిల్లులు ఈ ప్రాంతంలో అధికంగా ఉండటంతో పచ్చిధాన్యమే మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులకు ఆరబోత సమస్య లేకుండాపోయింది.
– పాల్వాయి శ్రవణ్ కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, హైదరాబాద్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

